Widt

28 జులై 2013 ఆదివారం

మోడీ పేరిట స్మార్ట్‌ఫోన్‌

గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేరిట స్మార్ట్‌ఫోన్‌ రానుంది. మోడీని మరో పేరు 'నమో'తో పిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ పేరు అత్యంత ప్రజాదరణ  పొందింది. ఇపుడు  ఈ పేరుతో మోడీ అభిమానులు కొత్త ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను సృష్టిస్తున్నారు. త్వరలో దీనిని నమో పేరుతో ఆవిష్కరించనున్నారు. యువ తరం ఆండ్రాయిడ్‌ మొబైల్‌గా 'నమో'ను రూపుదిద్దు తున్నారు. 'నరేంద్ర మోడీ సిగ్నేచర్‌ ఎడిషన్‌' హ్యాండ్‌సెట్‌ కోసం  ఇప్పటికే ఈ కంపెనీ పనులను ప్రారంభించింది. చైనాలో మొబైల్‌ వ్యాపారం కల్గిన గుజరాత్‌ వ్యాపారవేత్త కూడా స్మార్ట్‌ నమో గ్రూప్‌లో ఉన్నారు. వచ్చే నెలలో ఈ ఫోన్‌ను డిజైన్‌ చేసి, మోడీ ఆమోదం పొందే యత్నాలు జరుగుతున్నాయి.  గుజరాత్‌లోనే హ్యాండ్‌సెట్‌ ఉత్పత్తి ప్లాంటును నెలకొల్పే అవకాశాలున్నాయి . దీని వెల ప్రారంభంలో రూ.16వేల ఉంటుందని సమాచారం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...

Google+ Followers