21, జూన్ 2013, శుక్రవారం

శంకరన్నకు ఎన్నికష్టాలు ??


పాపం   మాజీ మంత్రి శంకర్రావు మళ్ళీ కష్టాల్లో చిక్కుకున్నారు . అందరికీ నీతులు బోధించే శంకరన్న  మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. స్వయానా కోడలి ను హింసించిన కేసులో పోలీసు స్టేషన్ లో లొంగిపోయి బెయిల్ తీసుకుని బయటపడ్డాడు. నిత్యం వివాదాలతో సావాసం, నోటికొచ్చినట్టు మాట్లాడి సంచలనాల కోసం పాకులాడడం శంకర్రావు స్టయిల్. గురివింద చందంగా తనకు నచ్చనివారిపై ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటు. ఇదే ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టింది.
వైఎస్ జగన్ పై  ఆరోపణలు చేసి రాష్ట్ర కేబినెట్ లో చోటు సంపాదించిన శంకర్రావు తన 'లూజ్ టంగ్'తో విమర్శల పాలయ్యారు. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గంలో చేరి  అదే పనిగా ఆరోపణలు గుప్పించారు . కిరణ్ ఒంటెత్తు పోకడలను మీడియా ముఖంగా కడిగిపారేశారు.  కిరణ్ కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసి మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. పదవి నుంచి దిగిపోగానే శంకర్రావుకు కష్టాలు మొదలయ్యాయి.
వివాదస్పద గ్రీన్ ఫీల్డ్ భూముల  కేసులో శంకర్రావును అవమానకరీతిలో అరెస్టయ్యారు. సీఎం కిరణ్ తనపై కక్ష కట్టి తనను అమానవీయంగా అరెస్టు చేయించారని శంకరన్న మండిపడ్డారు. తర్వాత అనారోగ్యంతో ఆస్పత్రిలో కొన్నాళ్లు గడిపి కోలుకుని బయటకు వచ్చిన తర్వాత శంకర్రావు తనదైన శైలిలోనే వ్యవహరిస్తున్నారు . తాజాగా మరో వివాదంలో ఆయన ఇరుకున్నారు. సొంత కోడలు వంశీప్రియ ఆయనపై కేసు పెట్టింది. శంకర్రావు, కుటుంబసభ్యులు తనను తీవ్రస్థాయిలో వేధిస్తున్నారని ఆమె హైకోర్టును ఆశ్రయించింది.కోడలి ఫిర్యాదుతో శంకర్రావు తన భార్య విశ్వశాంతితో పాటు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధీనంలోని మహిళా పోలీసుస్టేషన్‌లో  లొంగిపోయారు. న్యాయస్థానం నుంచి పొందిన ముందస్తు బెయిల్‌ ఆసరాతోబయటపడ్డారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలూ తీసుకుంటామని పోలీసులు అంటున్నారు . మొత్తానికి ఏదోవిధంగా నిత్యం వార్తల్లో ఉండడం శంక్రరావుకు అలవాటుగా మారిపోయింది.

అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టయింది మాజీ మంత్రి శంకర్రావు పరిస్థితి. అందరికీ నీతులు బోధించే శంకన్న మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. స్వయానా కోడలను హింసించిన కేసులో పోలీసు స్టేషన్ లో లొంగిపోయి బెయిల్ తీసుకుని బయటపడ్డాడు. నిత్యం వివాదాలతో సావాసం, నోటికొచ్చినట్టు మాట్లాడి సంచలనాల కోసం పాకులాడడం శంకర్రావు స్టయిల్. గురివింద చందంగా తనకు నచ్చనివారిపై ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటు. ఇదే ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టింది.

వైఎస్ఆర్ కుటుంబంపై ఆరోపణలు చేసి రాష్ట్ర కేబినెట్ లో చోటు సంపాదించిన శంకర్రావు తన 'లూజ్ టంగ్'తో విమర్శల పాలయ్యారు. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకుల శిబిరంలోని చేరి సమయం దొరికినప్పుడల్లా ఆయనపై దాడి చేశారు. కిరణ్ ఒంటెత్తు పోకడలను మీడియా ముఖంగా కడిగిపారేశారు. అంతేకుండా కిరణ్ కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసి మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. పదవి నుంచి దిగిపోగానే శంకర్రావుకు కష్టాలు మొదలయ్యాయి.

వివాదస్పద గ్రీన్ ఫీల్డ్ భూముల వివాదం కేసులో శంకర్రావును అవమానకరీతిలో అరెస్టయ్యారు. సీఎం కిరణ్ తనపై కక్ష కట్టి తనను అమానవీయంగా అరెస్టు చేయించారని శంకరన్న మండిపడ్డారు. తర్వాత అనారోగ్యంతో ఆస్పత్రిలో కొన్నాళ్లు గడిపి కోలుకుని బయటకు వచ్చిన తర్వాత శంకర్రావు తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. తాజాగా మరో వివాదంలో ఆయన ఇరుకున్నారు. సొంత కోడలు వంశీప్రియ ఆయనపై కేసు పెట్టింది. శంకర్రావు, కుటుంబసభ్యులు తనను తీవ్రస్థాయిలో వేధిస్తున్నారని ఆమె హైకోర్టును ఆశ్రయించింది.

కోడలి ఫిర్యాదుతో శంకర్రావు తన భార్య విశ్వశాంతితో పాటు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధీనంలోని మహిళా పోలీసుస్టేషన్‌లో బుధవారం(జూన్ 19) లొంగిపోయారు. న్యాయస్థానం నుంచి పొందిన ముందస్తు బెయిల్‌ను ఎగ్జిక్యూట్ చేయించుకున్నని పోలీసు స్టేషన్ నుంచి బయటపడ్డారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలూ తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఏదోవిధంగా నిత్యం వార్తల్లో ఉండడం శంక్రరావుకు అలవాటుగా మారిపోయింది. అయితే ఎదుటివారిపై విమర్శలు చేసే అర్హత తనకుందో, లేదో ఇప్పటికైనా ఆయన తెలుసుకుంటే మంచిది!

  
- See more at: http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=64302&subcatid=0&categoryid=28#sthash.BtZfO6j1.dpuf