16, అక్టోబర్ 2016, ఆదివారం

శంకరన్న ఏం చేస్తున్నారో ???

పాపం మాజీ మంత్రి శంకర్రావు ఏమి చేస్తున్నారో ? ఎక్కడా ఉలుకు పలుకు లేదు. సోనియమ్మ దేవత ఆమె పేరిట గుడి కడతా అన్నాడు. అదెంత వరకు వచ్చిందో తెలీదు. ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఓ వెలుగు వెలిగిన శంకరన్న అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నానా ఇబ్బందులు పడ్డాడు. నిత్యం వివాదాలతో సావాసం చేసి నోటికొచ్చినట్టు మాట్లాడి, అనవసరంగా సంచలనాల కోసం పాకులాడి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. తనకు నచ్చనివారిపై ఆరోపణలు చేయడం శంకరన్నకు అలవాటు. చివరకు అదే కొంప ముంచింది . మిగతా విశేషాల కోసం పై మేటర్ పై క్లిక్ చేయండి . 

రాత్రిళ్ళు అదృశ్యమయ్యే ఆలయం !!

గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ పట్టణానికి దగ్గర్లో ఉన్న కోలియాక్ గ్రామానికి సమీపంలో అరేబియా సముద్రంలో పరమేశ్వరుని దేవాలయం ఉంది . ఈ ఆలయాన్ని ‘నిష్కళంక మహాదేవ ఆలయం’ అని అంటారు. ప్రతి దేవాలయంలో ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ దేవాలయంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇదొక వింత ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత మరెక్కడా చూడలేము. అదేమిటంటే…  మిగతా వివరాలకోసం  పై మేటర్ పై  క్లిక్ చేయండి ... వీడియో ను చూడండి.
http://www.kaburluguru.com/banner/single/351

13, అక్టోబర్ 2016, గురువారం

10 వేల కోట్ల వ్యవహారంపై మోడీకి జగన్ లేఖ

హైదరాబాద్‌ నుంచి రూ.10వేల కోట్ల నల్లధనం ప్రకటించిన వ్యక్తి వైసీపీ అధ్యక్షుడు జగనే అని తెలుగు దేశం పార్టీ పదే పదే ఆరోపణలు చేస్తోన్న నేపధ్యంలో ఈ వ్యవహారం పై విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని గురువారం జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసారు. ఏపీ, తెలంగాణల నుంచి వెల్లడి అయిన నల్ల ధనం మొత్తం విలువ 13 వేల కోట్లు అని లెక్క తేలితే అందులో హైదరాబాద్ నుంచి 10 వేల కోట్లు ఒక్కరే ప్రకటించారని ఆ ఒక్కరు జగనే అని ఈ ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారం పై స్పందించిన జగన్ ఈ లేఖ రాసారు.ఈ లేఖలోనే జగన్ మరి కొన్ని అంశాలను ప్రస్తావించారు. స్వచ్చంద ఆదాయ వెల్లడి పధకం ప్రకారం ఏ వ్యక్తి ఎంత ప్రకటించారు ? ఏ ప్రాంతం నుంచి ప్రకటించారు తదితర వివరాలు బయటకు వెల్లడించరు. మోడీ ప్రభుత్వమే ఈ విషయాన్నీ స్పష్టం గా చెప్పింది. ఈ క్రమంలో మరి ఆ వివరాలు చంద్రబాబుకు ఎలా తెలిసాయి? అని జగన్ పేర్కొన్నారు.  to read more click on the matter.

12, అక్టోబర్ 2016, బుధవారం

ఈనాటి బంధం ఏనాటిదో ?

ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలితను దగ్గరుండి కనిపెట్టుకుని చూస్తున్న బృందం లో శశికళా నటరాజన్ ఒకరు . తమిళనాడు రాష్ట్ర పాలనా వ్యవహారాలను షీలా బాలకృష్ణన్ చూస్తుంటే ... శశి రాజకీయ వ్యవహారాలను నడిపిస్తున్నారు. శశి జయ ప్రాణసఖి. వీరిద్దరిది విడదీయ లేని బంధం. జయ, శశిల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈనాటిది కాదు. 1991లో అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చిన తరువాత అది వెలుగు చూసింది. అంతకుముందు నుంచే వీరిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నా అది పోయస్ గార్డెన్‌కే పరిమితం. అధికారంలోకి వచ్చాక ఇద్దరూ కలిసి కనిపించడంతో వీరి స్నేహం బహిర్గతమయ్యింది. గతంలో శశికళ వీడియో క్యాసెట్ల దుకాణం నడిపేది. అన్నాడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ఆ పార్టీకి ప్రచార కార్యదర్శిగా పని చేసే వారు.శశికళ ఆ ప్రచారానికి సంబంధించిన వీడియో క్యాసెట్లు తీసుకుని వచ్చి జయలలితకు అందజేసేవారు. అలా వీరిద్దరి మధ్య స్నేహం కుదరడంతో శశికళ, జయలలిత దగ్గరే ఉండిపోయారు. 1991లో పార్టీ అధికారంలోకి రావడంతో శశికళకు పార్టీలో పట్టు దొరికింది. జయలలితకు ఆమె మరీ అంతగా ఎలా దగ్గరయ్యారో ఈనాటికీ అంతుబట్టని విషయం. జయలలిత స్వతహాగా తెలివైనవారు.  to  see  more
click on the matter 

8, అక్టోబర్ 2016, శనివారం

ఎవరీ పన్నీర్ సెల్వమ్ ??

అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు వీర విధేయుడు.అన్నట్టు పన్నీర్ సెల్వం కూడా ఒకప్పుడు ఛాయ్ వాలానే. సెల్వం తండ్రి నడిపిన టీకొట్టును వారసత్వ సంపదగా స్వీకరించి కొన్నాళ్ళు నడిపారు. స్వర్గీయ ఎంజీ రామచంద్రన్, జయలలితకు ఈయన వీరాభిమాని. ఆ వీరాభిమానమే ఆయనను రెండు పర్యాయాలు తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. సాదాసీదాగా ఉండే సెల్వం మాటలు కూడా సాఫ్ట్ గా ఉంటాయంటారు. దైవ భక్తుడు. అమ్మకు వీర భక్తుడు. పాదాభివందనాలు చేసే వాడు. అన్నాడీఎంకే పార్టీ తోనే సెల్వం రాజకీయాల్లోకి వచ్చారు. పెరియకుళం మునిసిపల్ చైర్మన్ గా సెల్వం రాజకీయ జీవితం ఆరంభమైంది. 1996 నుంచి 2001 వరకు అదే పదవిలో కొనసాగేరు. 2001 శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది.  pl .see  more ఆన్ http://www.kaburluguru.com/banner/single/308


2, అక్టోబర్ 2016, ఆదివారం

బాబు గారు.. ఫేస్ బుక్ ను బ్యాన్ చేసేయండి సారూ !!

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు , ఏపీ సీఎం చంద్రబాబు గారికి నమస్కారం. మీ వీరాభిమాని ఆరుమళ్ల అప్పారావు రాయు లేఖ. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకు రావాలని ఈ లేఖ రాస్తున్నాను. అయ్యా ఈమధ్య మీమాటలు చిత్ర,విచిత్రం గా ఉంటున్నాయి. వాటిపై ఫేస్బుక్ లో పంచ్ ల పై పంచ్ లు పడుతున్నాయి. జోకులు పేలుతున్నాయి. చూడ లేక చస్తున్నాం. రచ్చబండ దగ్గర కుర్రోళ్ళు అవి చెప్పుకుంటూ , చూసుకుంటూ విరగబడి నవ్వుతున్నారు. వాళ్ళు అలా నవ్వుతుంటే.... ఏం చెప్పలేకపోతున్నాం .. ఏం చేయలేక పోతున్నాం. 'లోకేష్ బాబు వద్దంటేనే ప్రధాని పదవి వదిలేశా ' అని మీరు చెప్పినట్టు మన పత్రికలోనే వచ్చింది. అలాగే' ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రమ్మని ' తమరే చెప్పినట్టు మన పత్రికలోనే వార్తలొచ్చాయి. 'పట్టి సీమ కాలువ ను నదిగా మార్చేస్తా' అన్నారు .ఇదీ అంతే. ఆ జగన్ పేపర్ లో వస్తే నమ్మేవాళ్లం కాదు. అయినా కాలువ ను నదిగా ఎలా మారుస్తారు సారూ? ఇక బావులను అనుసంధానం చేస్తామని అన్నారట ? ఇది సాధ్యమేనా సారూ ?ఇలాంటివెన్నో మీరు అన్నట్టు వస్తున్నాయి. అయినా మీరు ఏంటీ ? మీ స్థాయి ఏంటీ సారూ ? మీ గురించి మీరు చెప్పుకుంటే విలువ ఏముంటది ? పార్టీ లో, ప్రభుత్వం లో బోలెడు మంది ఉన్నారు . వాళ్ళు చెబితే బాగుంటుంది కదా!! ఆమధ్య 'నేను మారాను' అని మీరంటే నిజమే అనుకున్నా. కానీ ఈ విధంగా మారతారని అనుకోలా. -ఫర్  See more  లింక్ పై క్లిక్ చేయండి 

1, అక్టోబర్ 2016, శనివారం

ఎవరీ బీహార్ బాహుబలి ??

బీహార్ బాహుబలి, ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ కు పాట్నా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడం తో మళ్ళీ జైలుకు వెళుతున్నాడు. రాజీవ్ రోషన్, అతడి ఇద్దరు సోదరుల హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన షాబుద్దీన్ 11 ఏళ్ల తర్వాత హైకోర్టు బెయిల్‌తో బయటకు వచ్చారు. వచ్చినోడు ఊరుకున్నాడా తింగరి కామెంట్లు చేసాడు. ఆయన అనుచరులు రెచ్చి పోయారు. దీంతో షాబుద్దీన్ మళ్ళీ కృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పని పరిస్థితులు వచ్చాయి. ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్,నితీశ్ కుమార్ ప్రభుత్వం కూడా బెయిల్ రద్దును కోరుతూ సుప్రీంకోర్టు కు వెళ్లారు . బాధిత కుటుంబాలు కూడా ఆయన బయటకు రావడం వల్ల తమకు ప్రాణాపాయం ఉందని మొర పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్ బెయిల్ రద్దు చేసింది. ఎవరీ షాబుద్దీన్ ? బీహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. ఈయన కథ కూడా సినిమా స్టోరీ లా ఉంటుంది . 30 కి పైగా కేసులున్న భయానక నేరచరిత్ర, నాలుగు సార్లు ఎంపీగా చేసిన రాజకీయ చరిత్ర. ఇవన్నీ కలిపితే షాబుద్దీన్. బిహార్ లో ఆయన పేరు వింటే ప్రత్యర్థులు, అధికార యంత్రాగం హడలిపోతారు. రెండు దశాబ్దాల పాటు నేరాలను, రాజకీయాలను సమాంతరంగా నడిపాడు. సొంత బలగాలను ఏర్పాటు చేసుకుని ఓ దశలో సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపాడు. లాలూకు సన్నిహితంగా ఉండే షాబుద్దీన్. జైలునుంచి రాగానే లాలూ కే తాను విధేయుడిగా ఉంటాను తప్ప నితీష్ కి కాదని చెప్పాడు. - See more at: http://www.kaburluguru.com/banner/single/279#sthash.qlhUnXZw.dpuf

30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

అసాధ్యుడు ఈ అజిత్ దోవల్

ఇపుడు అందరి నోటా అజిత్ మాటే !! 
ప్రధాని మోడీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి. అజిత్ తొలుత కేంద్రం లో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. కీర్తి చక్ర అవార్డు దక్కించుకున్న అరుదైన పోలీస్ ఆఫీసర్. 1980 నుంచీ భారత్‌లో భద్రతా చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. 1980లలో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలోఅజిత్ దోవల్ ఆ సంస్థలోకి చొరబడి, దాని అగ్రకమాండర్లు ఆరుగురిని మట్టుబెట్టారు. దాంతో ఎంఎన్ఎఫ్ ఉనికి గంగలో కలిసిపోయింది. అజిత్ పాకిస్థానీ ముస్లిం పౌరుడిలా పాక్‌లో ఏడు సంవత్సరాలు గడిపారు. -పూర్తి వివరాల కోసం మేటర్ పై క్లిక్ చేయండి. 

అమ్మ ఆరోగ్యంపై సోషల్ మీడియా కథనాలు నిజం కాదట!!

తమిళనాడు  సీఎం జయలలిత ఆరోగ్యం పై  సోషల్ మీడియా లో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.
అయితే అవన్నీ అవాస్తవమని , జయలలిత కోలుకుంటున్నారని  అపోలో హాస్పిటల్ వైద్యులు , అన్నాడీఎంకే నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ 23 న జయలలిత జ్వరం , డీహైడ్రేషన్ తో ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి హాస్పిటల్ వర్గాలు ఆమె కోలుకుంటున్నారని ఒకటి రెండు బులెటిన్స్ విడుదల చేశాయి కానీ ఫోటోలు ఏమి విడుదల చేయలేదు. ఆమె వైద్యానికి సహకరిస్తున్నారని , కోలుకోవడానికి మరికొద్ది రోజులు పడుతుందని వైద్యులు అంటున్నారు. వారం రోజులు అయినా డిశ్చార్జ్ కాకపోవడం తో   ఏదో గోప్యత పాటిస్తున్నారని ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇదిలా ఉంటే డీఎంకే అధినేత కరుణా నిధి కూడా జయ ఆరోగ్యం పై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయక పోవడం మూలానా ప్రజలు ఉద్వేగానికి గురవుతున్నారని అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. జయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ పేరిట  అమ్మఆరోగ్యం బాగున్నట్టు గురువారం ఒక ప్రెస్ నోట్  రిలీజ్ అయింది. కాగా అమ్మ  ఆరోగ్యం పై సోషల్ మీడియా లో వ్యతిరేక ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇక అమ్మ అభిమానులు జయ త్వరితగతిన కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. దేవుళ్ళకు మొక్కుతున్నారు.

27, సెప్టెంబర్ 2016, మంగళవారం

తండ్రులు ఒకే ... తనయులు వీక్ !!

 రాజకీయాల్లో వారసత్వం కొనసాగుతోంది . ప్రజలు కూడా ఇందుకు హర్షామోదాలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వారసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే కీలక పదవుల్లోకి అందరూ ఎదగలేకపోతున్నారు. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి . వారసుల్లో నాయకత్వ లక్షణాలు లేకపోవడం , అవకాశం అందిపుచ్చుకోలేకపోవడం, పూర్తి స్థాయి రాజకీయాలపట్ల అనాసక్తి , వాగ్ధాటి లేకపోవడం ఇతరత్రా బిజీ గా ఉండటం వంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు నాట రాజకీయ వారసులు ఎందరో ఉన్నారు. వారిలో దూకుడు మీద ఉన్నవారు కొందరే. ఇంకొందరు అవకాశాలు అంది పుచ్చుకోలేక వెనుకబడి పోయారు. ఆ వారసుల బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రాణించని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల వారసులు 4
http://www.kaburluguru.com/banner/single/262