1, అక్టోబర్ 2016, శనివారం

ఎవరీ బీహార్ బాహుబలి ??

బీహార్ బాహుబలి, ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ కు పాట్నా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడం తో మళ్ళీ జైలుకు వెళుతున్నాడు. రాజీవ్ రోషన్, అతడి ఇద్దరు సోదరుల హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన షాబుద్దీన్ 11 ఏళ్ల తర్వాత హైకోర్టు బెయిల్‌తో బయటకు వచ్చారు. వచ్చినోడు ఊరుకున్నాడా తింగరి కామెంట్లు చేసాడు. ఆయన అనుచరులు రెచ్చి పోయారు. దీంతో షాబుద్దీన్ మళ్ళీ కృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పని పరిస్థితులు వచ్చాయి. ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్,నితీశ్ కుమార్ ప్రభుత్వం కూడా బెయిల్ రద్దును కోరుతూ సుప్రీంకోర్టు కు వెళ్లారు . బాధిత కుటుంబాలు కూడా ఆయన బయటకు రావడం వల్ల తమకు ప్రాణాపాయం ఉందని మొర పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్ బెయిల్ రద్దు చేసింది. ఎవరీ షాబుద్దీన్ ? బీహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. ఈయన కథ కూడా సినిమా స్టోరీ లా ఉంటుంది . 30 కి పైగా కేసులున్న భయానక నేరచరిత్ర, నాలుగు సార్లు ఎంపీగా చేసిన రాజకీయ చరిత్ర. ఇవన్నీ కలిపితే షాబుద్దీన్. బిహార్ లో ఆయన పేరు వింటే ప్రత్యర్థులు, అధికార యంత్రాగం హడలిపోతారు. రెండు దశాబ్దాల పాటు నేరాలను, రాజకీయాలను సమాంతరంగా నడిపాడు. సొంత బలగాలను ఏర్పాటు చేసుకుని ఓ దశలో సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపాడు. లాలూకు సన్నిహితంగా ఉండే షాబుద్దీన్. జైలునుంచి రాగానే లాలూ కే తాను విధేయుడిగా ఉంటాను తప్ప నితీష్ కి కాదని చెప్పాడు. - See more at: http://www.kaburluguru.com/banner/single/279#sthash.qlhUnXZw.dpuf

30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

అసాధ్యుడు ఈ అజిత్ దోవల్

ఇపుడు అందరి నోటా అజిత్ మాటే !! 
ప్రధాని మోడీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి. అజిత్ తొలుత కేంద్రం లో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. కీర్తి చక్ర అవార్డు దక్కించుకున్న అరుదైన పోలీస్ ఆఫీసర్. 1980 నుంచీ భారత్‌లో భద్రతా చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. 1980లలో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలోఅజిత్ దోవల్ ఆ సంస్థలోకి చొరబడి, దాని అగ్రకమాండర్లు ఆరుగురిని మట్టుబెట్టారు. దాంతో ఎంఎన్ఎఫ్ ఉనికి గంగలో కలిసిపోయింది. అజిత్ పాకిస్థానీ ముస్లిం పౌరుడిలా పాక్‌లో ఏడు సంవత్సరాలు గడిపారు. -పూర్తి వివరాల కోసం మేటర్ పై క్లిక్ చేయండి. 

అమ్మ ఆరోగ్యంపై సోషల్ మీడియా కథనాలు నిజం కాదట!!

తమిళనాడు  సీఎం జయలలిత ఆరోగ్యం పై  సోషల్ మీడియా లో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.
అయితే అవన్నీ అవాస్తవమని , జయలలిత కోలుకుంటున్నారని  అపోలో హాస్పిటల్ వైద్యులు , అన్నాడీఎంకే నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ 23 న జయలలిత జ్వరం , డీహైడ్రేషన్ తో ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి హాస్పిటల్ వర్గాలు ఆమె కోలుకుంటున్నారని ఒకటి రెండు బులెటిన్స్ విడుదల చేశాయి కానీ ఫోటోలు ఏమి విడుదల చేయలేదు. ఆమె వైద్యానికి సహకరిస్తున్నారని , కోలుకోవడానికి మరికొద్ది రోజులు పడుతుందని వైద్యులు అంటున్నారు. వారం రోజులు అయినా డిశ్చార్జ్ కాకపోవడం తో   ఏదో గోప్యత పాటిస్తున్నారని ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇదిలా ఉంటే డీఎంకే అధినేత కరుణా నిధి కూడా జయ ఆరోగ్యం పై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయక పోవడం మూలానా ప్రజలు ఉద్వేగానికి గురవుతున్నారని అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. జయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ పేరిట  అమ్మఆరోగ్యం బాగున్నట్టు గురువారం ఒక ప్రెస్ నోట్  రిలీజ్ అయింది. కాగా అమ్మ  ఆరోగ్యం పై సోషల్ మీడియా లో వ్యతిరేక ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇక అమ్మ అభిమానులు జయ త్వరితగతిన కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. దేవుళ్ళకు మొక్కుతున్నారు.

27, సెప్టెంబర్ 2016, మంగళవారం

తండ్రులు ఒకే ... తనయులు వీక్ !!

 రాజకీయాల్లో వారసత్వం కొనసాగుతోంది . ప్రజలు కూడా ఇందుకు హర్షామోదాలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వారసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే కీలక పదవుల్లోకి అందరూ ఎదగలేకపోతున్నారు. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి . వారసుల్లో నాయకత్వ లక్షణాలు లేకపోవడం , అవకాశం అందిపుచ్చుకోలేకపోవడం, పూర్తి స్థాయి రాజకీయాలపట్ల అనాసక్తి , వాగ్ధాటి లేకపోవడం ఇతరత్రా బిజీ గా ఉండటం వంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు నాట రాజకీయ వారసులు ఎందరో ఉన్నారు. వారిలో దూకుడు మీద ఉన్నవారు కొందరే. ఇంకొందరు అవకాశాలు అంది పుచ్చుకోలేక వెనుకబడి పోయారు. ఆ వారసుల బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రాణించని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల వారసులు 4
http://www.kaburluguru.com/banner/single/262