8, అక్టోబర్ 2016, శనివారం

ఎవరీ పన్నీర్ సెల్వమ్ ??

అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు వీర విధేయుడు.అన్నట్టు పన్నీర్ సెల్వం కూడా ఒకప్పుడు ఛాయ్ వాలానే. సెల్వం తండ్రి నడిపిన టీకొట్టును వారసత్వ సంపదగా స్వీకరించి కొన్నాళ్ళు నడిపారు. స్వర్గీయ ఎంజీ రామచంద్రన్, జయలలితకు ఈయన వీరాభిమాని. ఆ వీరాభిమానమే ఆయనను రెండు పర్యాయాలు తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. సాదాసీదాగా ఉండే సెల్వం మాటలు కూడా సాఫ్ట్ గా ఉంటాయంటారు. దైవ భక్తుడు. అమ్మకు వీర భక్తుడు. పాదాభివందనాలు చేసే వాడు. అన్నాడీఎంకే పార్టీ తోనే సెల్వం రాజకీయాల్లోకి వచ్చారు. పెరియకుళం మునిసిపల్ చైర్మన్ గా సెల్వం రాజకీయ జీవితం ఆరంభమైంది. 1996 నుంచి 2001 వరకు అదే పదవిలో కొనసాగేరు. 2001 శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది.  pl .see  more ఆన్ http://www.kaburluguru.com/banner/single/308


2, అక్టోబర్ 2016, ఆదివారం

బాబు గారు.. ఫేస్ బుక్ ను బ్యాన్ చేసేయండి సారూ !!

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు , ఏపీ సీఎం చంద్రబాబు గారికి నమస్కారం. మీ వీరాభిమాని ఆరుమళ్ల అప్పారావు రాయు లేఖ. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకు రావాలని ఈ లేఖ రాస్తున్నాను. అయ్యా ఈమధ్య మీమాటలు చిత్ర,విచిత్రం గా ఉంటున్నాయి. వాటిపై ఫేస్బుక్ లో పంచ్ ల పై పంచ్ లు పడుతున్నాయి. జోకులు పేలుతున్నాయి. చూడ లేక చస్తున్నాం. రచ్చబండ దగ్గర కుర్రోళ్ళు అవి చెప్పుకుంటూ , చూసుకుంటూ విరగబడి నవ్వుతున్నారు. వాళ్ళు అలా నవ్వుతుంటే.... ఏం చెప్పలేకపోతున్నాం .. ఏం చేయలేక పోతున్నాం. 'లోకేష్ బాబు వద్దంటేనే ప్రధాని పదవి వదిలేశా ' అని మీరు చెప్పినట్టు మన పత్రికలోనే వచ్చింది. అలాగే' ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రమ్మని ' తమరే చెప్పినట్టు మన పత్రికలోనే వార్తలొచ్చాయి. 'పట్టి సీమ కాలువ ను నదిగా మార్చేస్తా' అన్నారు .ఇదీ అంతే. ఆ జగన్ పేపర్ లో వస్తే నమ్మేవాళ్లం కాదు. అయినా కాలువ ను నదిగా ఎలా మారుస్తారు సారూ? ఇక బావులను అనుసంధానం చేస్తామని అన్నారట ? ఇది సాధ్యమేనా సారూ ?ఇలాంటివెన్నో మీరు అన్నట్టు వస్తున్నాయి. అయినా మీరు ఏంటీ ? మీ స్థాయి ఏంటీ సారూ ? మీ గురించి మీరు చెప్పుకుంటే విలువ ఏముంటది ? పార్టీ లో, ప్రభుత్వం లో బోలెడు మంది ఉన్నారు . వాళ్ళు చెబితే బాగుంటుంది కదా!! ఆమధ్య 'నేను మారాను' అని మీరంటే నిజమే అనుకున్నా. కానీ ఈ విధంగా మారతారని అనుకోలా. -ఫర్  See more  లింక్ పై క్లిక్ చేయండి