రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా దిగ్విజయ్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ సీన్ పూర్తిగా మార్చేశారు. అలా వచ్చి రాగానే విభజన, సమైక్యంపై రాష్ట్రంలో ముఖ్యనేతల నుంచి నివేదికలు కోరడంతోనే రాజకీయ వేడి రగిలింది. దానిని క్రమంగా పెంచుకుంటూ పోయారు. అటు అధిష్టానం కూడా తెలంగాణపై తేల్చేసింది. విభజనకు అనుకూలమని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని తెలిపింది.. ఈ ప్రకటన తర్వాత సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ప్రారంభమైంది.రోజురోజుకి ఉద్యమం ఉధృతమవుతుంటే..దానికి ఆజ్యంపోసేలా దిగ్విజయ్.. తెలంగాణపై వెనక్కు వెళ్లేది లేదని పదే పదే ప్రకటనలు చేశారు . దీనిపైనే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఒక వైపు సమైక్య నిరసనలు మిన్నంటుతుంటే ఢిల్లీ నుంచి వచ్చే ప్రకటనలతో సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా మారారు. ముఖ్యంగా కేంద్రమంత్రులు, ఎంపీలపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది.సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు.. కాంగ్రెస్ హైకమాండ్‌కు దిగ్విజయ్ దూకుడుకు కళ్లెం వేయాలని వేడుకోవటంతో ప్రస్తుతం ఆయన మౌనం పాటిస్తున్నారని ఢిల్లీ వర్గాలంటున్నాయి. విభజన ప్రకటన తర్వాత రాష్ట్రానికి వస్తానని.. ఇరు ప్రాంత నేతలతో చర్చించి.. సమస్య పరిష్కారం చేస్తానని చెప్పిన దిగ్విజయ్ ఇప్పుడు పత్తా లేరు. మన రాష్ట్రానికి రావడం పక్కన పెడితే.. కనీస ఏపీ వ్యవహారాలపై స్పందించడం కూడా మానేశారు. ఇక సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగడంతో విభజన ప్రక్రియపై కాంగ్రెస్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. క్రమంగా కేబినెట్ నోట్‌ను కూడా వివిధ కారణాల సాకుతో వాయిదా వేసుకుంటూ వస్తుంది. ఈ సమయంలో మీడియా విభజనపై ఎందుకు ముందడుగు వేయటం లేదని ప్రశ్నిస్తే.. ఏమని సమాధానం చెప్పాలి..? అనేది కూడా దిగ్విజయ్ సింగ్‌కు అంతుబట్టడం లేదు.. మొత్తానికి డిగ్గీరాజా.. నోటికి తాళం వేసుకున్నారు. అప్పడప్పుడు మోడీ మీద విమర్శల బాణాలు విసురుతున్న ఏపీ వ్యవహారాల మీద మాత్రం నోరు మెదపడం లేదు.
19, సెప్టెంబర్ 2013, గురువారం
డిగ్గీరాజా నోటికి తాళం

1, ఆగస్టు 2013, గురువారం
'రాములమ్మ' దారెటు?
25, జులై 2013, గురువారం
రావణుడు యుద్ధంలో మరణించ లేదా .?
రాజ్య పరిరక్షణకు సుశిక్షుతులైన సైన్యాన్ని రావణుడు ఏర్పాటు చేశారట . యుద్ధ పరిసరాల్లో కలిసిపోయేలా దుస్తుల్ని ధరించటం మొదలు పెట్టిన మొట్టమొదటి సైన్యం రావణాసురుడిదే అట . ఆయన సైన్యం యుద్ధాల్లో త్రాచుపాము విషం కలిపిన మారణాయుధాల్ని ఎక్కువగా ఉపయోగించే వారట . ప్రపంచలో మొట్టమొదటి విమానాన్ని కలిగిఉన్న పాలకుడు రావణుడే. బలమైన నావికాదళాన్ని సైతం ఆయన నిర్మించుకున్నాడట . ఆ రోజుల్లో తీవ్ర నేరాలు చేసిన వాళ్లను సజీవంగా సమాధి చేయటం వంటి కఠిన శిక్షల్ని అమలు చేసినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
మనకు తెలిసిన రామాయణం ప్రకారం రామబాణం వేటుకు రావణాసురుడు కుప్పకూలాడు . అయితే మిరాండో పరిశోధనల్లో మాత్రం రావణుడు రామ-రావణయుద్ధంలో చావలేదు. కానీ విషపూరితమైన రాముడి బాణాలు తగిలి., కొంత కాలం తర్వాత చనిపోయాడు. అలాగే అజేయమైన, సైన్యం అనన్య శస్త్రాస్త్రాలు న్న రావణాసురుడు ఓ సామాన్యరాజైన రాముడి చేతిలో చనిపోవటానికి అంతఃపుర కుట్రలు కారణం అని తాజా పుస్తకం వెల్లడిస్తోంది. రావణాసురుడి భార్య మండోదరి, తమ్ముడు విభీషణుడు రాముడి పక్షం వహించటంతో., రావణుడి యుద్ధ వ్యూహాలన్నీ ముందుగానే రాముడి శిబిరానికి తెలిసిపోయేవి. ఫలితంగా రావణాసురుడితో పోలిస్తే., ఏ మాత్రం సరితూగలేని రాముడి వానరసైన్యం .., సునాయాసంగా విజయం సాధించారట . ముల్లోకాల్ని గడగడలాడించిన రావణుడు కేవలం అంతఃపుర కుట్రలకు, సొంతవాళ్ల నమ్మకద్రోహం కారణంగా ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నట్లు తాజా పుస్తకం వివరిస్తోంది. ఇదే విషయాన్ని రచయిత, ఉత్తరాది నుంచి వచ్చిన ఓ ఆర్యన్ తెగ దాడులతో శ్రీలంక చరిత్రలోనే విశిష్టమైన రావణాసురుడి శకం ముగిసినట్లు చెబుతాడు..
21, జూన్ 2013, శుక్రవారం
శంకరన్నకు ఎన్నికష్టాలు ??
పాపం మాజీ మంత్రి శంకర్రావు మళ్ళీ కష్టాల్లో చిక్కుకున్నారు . అందరికీ నీతులు బోధించే శంకరన్న మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. స్వయానా కోడలి ను హింసించిన కేసులో పోలీసు స్టేషన్ లో లొంగిపోయి బెయిల్ తీసుకుని బయటపడ్డాడు. నిత్యం వివాదాలతో సావాసం, నోటికొచ్చినట్టు మాట్లాడి సంచలనాల కోసం పాకులాడడం శంకర్రావు స్టయిల్. గురివింద చందంగా తనకు నచ్చనివారిపై ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటు. ఇదే ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టింది.
వైఎస్ జగన్ పై ఆరోపణలు చేసి రాష్ట్ర కేబినెట్ లో చోటు సంపాదించిన శంకర్రావు తన 'లూజ్ టంగ్'తో విమర్శల పాలయ్యారు. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గంలో చేరి అదే పనిగా ఆరోపణలు గుప్పించారు . కిరణ్ ఒంటెత్తు పోకడలను మీడియా ముఖంగా కడిగిపారేశారు. కిరణ్ కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసి మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. పదవి నుంచి దిగిపోగానే శంకర్రావుకు కష్టాలు మొదలయ్యాయి.
వివాదస్పద గ్రీన్ ఫీల్డ్ భూముల కేసులో శంకర్రావును అవమానకరీతిలో అరెస్టయ్యారు. సీఎం కిరణ్ తనపై కక్ష కట్టి తనను అమానవీయంగా అరెస్టు చేయించారని శంకరన్న మండిపడ్డారు. తర్వాత అనారోగ్యంతో ఆస్పత్రిలో కొన్నాళ్లు గడిపి కోలుకుని బయటకు వచ్చిన తర్వాత శంకర్రావు తనదైన శైలిలోనే వ్యవహరిస్తున్నారు . తాజాగా మరో వివాదంలో ఆయన ఇరుకున్నారు. సొంత కోడలు వంశీప్రియ ఆయనపై కేసు పెట్టింది. శంకర్రావు, కుటుంబసభ్యులు తనను తీవ్రస్థాయిలో వేధిస్తున్నారని ఆమె హైకోర్టును ఆశ్రయించింది.కోడలి ఫిర్యాదుతో శంకర్రావు తన భార్య విశ్వశాంతితో పాటు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధీనంలోని మహిళా పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. న్యాయస్థానం నుంచి పొందిన ముందస్తు బెయిల్ ఆసరాతోబయటపడ్డారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలూ తీసుకుంటామని పోలీసులు అంటున్నారు . మొత్తానికి ఏదోవిధంగా నిత్యం వార్తల్లో ఉండడం శంక్రరావుకు అలవాటుగా మారిపోయింది.
అందరికీ
శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టయింది మాజీ మంత్రి
శంకర్రావు పరిస్థితి. అందరికీ నీతులు బోధించే శంకన్న మరోసారి పోలీస్
స్టేషన్ మెట్లు ఎక్కాడు. స్వయానా కోడలను హింసించిన కేసులో పోలీసు స్టేషన్
లో లొంగిపోయి బెయిల్ తీసుకుని బయటపడ్డాడు. నిత్యం వివాదాలతో సావాసం,
నోటికొచ్చినట్టు మాట్లాడి సంచలనాల కోసం పాకులాడడం శంకర్రావు స్టయిల్.
గురివింద చందంగా తనకు నచ్చనివారిపై ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటు. ఇదే ఆయనకు
కష్టాలు తెచ్చిపెట్టింది.
వైఎస్ఆర్ కుటుంబంపై ఆరోపణలు చేసి రాష్ట్ర కేబినెట్ లో చోటు సంపాదించిన శంకర్రావు తన 'లూజ్ టంగ్'తో విమర్శల పాలయ్యారు. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకుల శిబిరంలోని చేరి సమయం దొరికినప్పుడల్లా ఆయనపై దాడి చేశారు. కిరణ్ ఒంటెత్తు పోకడలను మీడియా ముఖంగా కడిగిపారేశారు. అంతేకుండా కిరణ్ కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసి మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. పదవి నుంచి దిగిపోగానే శంకర్రావుకు కష్టాలు మొదలయ్యాయి.
వివాదస్పద గ్రీన్ ఫీల్డ్ భూముల వివాదం కేసులో శంకర్రావును అవమానకరీతిలో అరెస్టయ్యారు. సీఎం కిరణ్ తనపై కక్ష కట్టి తనను అమానవీయంగా అరెస్టు చేయించారని శంకరన్న మండిపడ్డారు. తర్వాత అనారోగ్యంతో ఆస్పత్రిలో కొన్నాళ్లు గడిపి కోలుకుని బయటకు వచ్చిన తర్వాత శంకర్రావు తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. తాజాగా మరో వివాదంలో ఆయన ఇరుకున్నారు. సొంత కోడలు వంశీప్రియ ఆయనపై కేసు పెట్టింది. శంకర్రావు, కుటుంబసభ్యులు తనను తీవ్రస్థాయిలో వేధిస్తున్నారని ఆమె హైకోర్టును ఆశ్రయించింది.
కోడలి ఫిర్యాదుతో శంకర్రావు తన భార్య విశ్వశాంతితో పాటు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధీనంలోని మహిళా పోలీసుస్టేషన్లో బుధవారం(జూన్ 19) లొంగిపోయారు. న్యాయస్థానం నుంచి పొందిన ముందస్తు బెయిల్‌ను ఎగ్జిక్యూట్ చేయించుకున్నని పోలీసు స్టేషన్ నుంచి బయటపడ్డారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలూ తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఏదోవిధంగా నిత్యం వార్తల్లో ఉండడం శంక్రరావుకు అలవాటుగా మారిపోయింది. అయితే ఎదుటివారిపై విమర్శలు చేసే అర్హత తనకుందో, లేదో ఇప్పటికైనా ఆయన తెలుసుకుంటే మంచిది!

24, ఫిబ్రవరి 2013, ఆదివారం
ఏ చానల్ చూసినా ఏమున్నది గర్వ కారణం ?
కొన్ని చానల్స్ అయితే బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నాయని ఆరోపణలు కూడా సర్వత్ర వినిపిస్తున్నాయి.ప్రస్తుతం తెలుగులో సాక్షి ,టీవీ 9,టీవీ 5,ఎన్ టీవీ ,జీ న్యూస్ ,మహా న్యూస్, ఆంధ్రజ్యోతి, టీ న్యూస్ , ఐ న్యూస్ , ఈ టీవీ ,వీ 6, హెచ్ ఏం టీవీ ,స్టూడియో యెన్ ,జెమినీ ,మెట్రో టీవీ,సీవీఆర్ ,ఆర్ కే న్యూస్ వంటి చానల్స్ వార్తలను ప్రసారం చేస్తున్నాయి.మరికొన్ని చానల్స్ 24 గంటలు నిరంతరం వార్తా ప్రసారాలను అందిస్తున్నాయి . మాటీవీ కొన్నాళ్ళు "న్యూస్ "ప్రసారం చేసి మధ్యలో మానేసింది.వీటిలో చాలా చానల్స్ రాజకీయ పార్టీలతో లింక్ లున్నవే. జగన్ పార్టీకి సాక్షి అనుబంధ సంస్త అనేది అందరికి తెల్సిందే. మహా న్యూస్, ఆంధ్రజ్యోతి ,టీవీ 9 చానల్స్ "తెలుగుదేశం "కు సహకారం అందిస్తున్నాయి.ఇక "ఈ టీవీ " సంగతి బహిరంగ రహస్యమే. తెలుగు నాట రాజకీయపార్టీలకు బహిరంగంగా మద్దతు పలికిన ఖ్యాతి "ఈనాడు"దే. తర్వాత కాలం లో క్రమంగా ప్రింట్ మీడియా లోని కొన్ని వార్తా పత్రికలూ ..... ఆపైన చానల్స్ రాజకీయ పార్టీలకు బహిరంగం గానే సపోర్ట్ ఇస్తున్నాయి. 2005 తర్వాత్ రాజకీయనేతలే చానల్స్ పెట్టె ఆనవాయితీ మొదలైంది. వైఎస్ ఇందుకు శ్రీకారం చుట్టారు.వైఎస్ అధికారంలోకొచ్చాక ఈనాడు ,జ్యోతి అయన కు వ్యతిరేక వార్తా కధనాలను ప్రచురించేవి.సొంత మీడియా వుంటే మేలని అయన సాక్షిని కొడుకు చేత మొదలెట్టించారు.
ఆ తర్వాత తెరాస నేత కేసీఆర్ పార్టీ కోసం ఒక న్యూస్ చానల్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ గ్రూపు రెండు చానల్స్ నడుపుతుంటే, పిసిసి అధ్యక్షుడు ఒక చానల్ నడుపుతున్నారు . సీపీఎం పార్టీ కూడా కొత్త చానల్ ను ప్రారంభించ బోతోంది. ఒక దశలో ప్రస్తుత కేంద్రమంత్రి చిరంజీవి కూడా ఒక చానల్ పెట్టాలని యోచించి తర్వాత విరమించుకున్నారు. ఇటీవల కాలం లో చానల్స్ సంఖ్య పెరిగిపోవడం, ఆదాయం తగ్గడం, వ్యయం పెరగడం వంటి కారణాలుగా చానల్స్ రాజకీయ నాయకుల చేతిలోకి వెళుతున్నాయి.ఇదొక కొత్త పరిణామం. ఈ పరిణామం వల్ల చానల్స్ విశ్వసనీయతను కోల్పోతున్నాయి.అదలా ఉంటె మన చానల్స్ లో వార్తలు ఎలా ఉంటాయంటే జీ న్యూస్ లో కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ లభించే విధంగా వార్తలు ఉంటే .,,ఇక ఐ న్యూస్‌లో ముఖ్యమంత్రి కిరణ్ ఇమేజ్ ను బూస్టప్ చేసేలా వార్తా కధనాలు ప్రసారమౌతుంటాయి . గతంలో ఒకే వర్గం చేతిలో మీడియా ఉన్నప్పుడు చంద్రబాబు పాలనను ఏ విధంగా ఆకాశానికి ఎత్తారో ఇప్పుడు ఐ న్యూస్‌లో కిరణ్‌కు ఆ స్థానం కల్పిస్తున్నారు. సమస్యలన్నీ అదిగమించి ఆయన దూసుకెళుతున్నారట! ఇక ఆంధ్ర జ్యోతి ఈటీవీ ,టీవీ 9,మహా న్యూస్ వంటి చానల్స్ లో చంద్రబాబు కి అనుకూల వార్తలు ప్రసారమౌతుంటాయి. . ఆ చానల్స్ లో కొన్నింటికి చంద్రబాబు ఆర్ధికం గా సహాయ పడ్డారని,కొన్నింటిలో అయన వాటాదారు అని అంటారు. ఇందులో నిజం ఎంతో ఏమో గానీ ఆ చానల్స్ అన్నీ బాబుకి వ్యతిరేకంగా ఎలాంటి వార్తా కధనాలు ప్రసారం చేయవు.అవేపుడూ బాబు వ్యతిరేకులను ఉతికి ఆరేస్తుంటాయి.
ముఖ్యంగా చనిపోయిన వైఎస్ ,జైల్లో వున్నజగన్ ఆ చానల్స్ కి హాట్ సబ్జెక్ట్స్.ఇక జగన్ చానల్ సాక్షి ఆ చానల్స్ లో వచ్చే కథనాలను తిప్పి కొడుతూ బాబును ,రామోజీని తూర్పరా పడుతోంది.
టీ న్యూస్ తెలంగాణ వాదానికి, టిఆర్ఎస్కు అండగా నిలుస్తోంది. అలా అని మిగిలిని చానల్స్ నిస్పక్షపాతంగా ఉంటున్నాయని కాదు. అంశాల వారిగా, ఒప్పందాల వారిగా కొన్ని చానల్స్ కొన్ని పార్టీలకు అండగా నిలుస్తున్నాయి.ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఓ న్యూస్‌చానల్‌ను పెట్టుకోవచ్చు.దేశంలో ఇప్పటివరకు 122 న్యూస్‌చానల్స్ ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇవి ప్రపంచంలోనే చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ చానల్స్ మధ్య ప్రకటనల యుద్ధం కొనసాగుతుంది. గత రెండు సంవత్సరా లుగా ప్రకటనల రూపంలో ఈ చానల్స్ రూ.2,000 కోట్ల మేరకు వ్యాపారం చేశాయి. తెలుగులో 17 న్యూస్ చానళ్ళు ఉన్నాయి. ప్రకటనల ఆదాయం అన్ని చానళ్ళకు సరిపోదు. అంటే ప్రకటన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు ఈ చానళ్ళ మీద అవుతోంది. తెలుగు న్యూస్ చానళ్లలో చాలా చానల్స్ నష్టాలతోనే నడుస్తున్నాయి. మంచి మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ లేని కొరత చానల్స్ లో కన్పిస్తోంది.ఫలితంగా యాడ్ రెవిన్యూలో వెనుకబడి నష్టాల్లో కూరుకుపోతున్నాయి.
చానల్స్ కి ఎన్నికల ముందు అయితే ఆదాయం ఉంటుంది కానీ ఇప్పుడు ఆదాయం లేక చాలా చానళ్ళు విలవిల్లాడుతున్నాయి.ఈక్రమం లో అడ్డ దారి తొక్కుతున్నాయి. లేదా రాజకీయ నేతల చేతుల్లోకి వెళుతున్నాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా పంపిణీ, టాలెంట్ ధరలు రెట్టింపయ్యాయి. టాలెంట్ ఖర్చులు అంటే ప్రొడ్యూ షర్లు, రిపోర్టర్లు, టెక్నిషన్స్, యాంకర్లు ఇలా వారి టాలెంట్‌ను బట్టి వేతనాలు ఇవ్వాలి. అలా చేయలేక కొన్ని చానల్స్ వెనుక పడుతున్నాయి. ఇక తెలుగు న్యూస్ మార్కెట్ విషయానికొస్తే.2007లో కేవలం ఐదు న్యూస్ చానల్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉండేవి.అవి ఇపుడు 17కు చేరుకున్నాయి.వీటన్నింటికి సరి పడా యాడ్ మార్కెట్లేదు.
తరువాయి పార్ట్ 2 లో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)