congress లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
congress లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఫిబ్రవరి 2014, సోమవారం

సోనియా ఆస్తులెంత???

చట్టాలు ప్రజలకే కానీ పాలకులకు కాదట .సమాచారహక్కు  చట్టాన్ని తీసుకొచ్చింది తామే అని పదేపదే చంకలు గుద్దుకునే కాంగ్రెస్ నేతలు తమ ఆస్తులు ఎంతో చెప్పరు...చెప్పడానికి ఇష్టపడరు..ఇందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా కూడా మినహాయింపు ఏమి కాదు.2012 లో చెన్నై కి చెందిన గోపాల కృష్ణన్ సోనియా ఆదాయ పన్ను వివరాలను అడుగుతూ సహ చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా ఐటీ అధికారులు చేతులెత్తేశారు.ఐటీ అధికారులు సమాచారం ఇవ్వాలా వద్దా ?అని సోనియా ను అడగగా ఆమె అందుకు అంగీకరించలేదట.ఆ సమాచారం వ్యక్తిగతమని చెప్పారట.ఎంపీల వ్యాపారాలకు సంబంధించిన దరఖాస్తుదారులకు గతం లోనే కేంద్ర సమాచార కమీషన్ ఆదేశించింది.అయితే ఆ ఆదేశాలు కాగితాలకే పరిమిత మౌతున్నాయి.ఇలాంటి పరిస్తితుల్లో ఎవరేమి చేస్తారు??

19, సెప్టెంబర్ 2013, గురువారం

డిగ్గీరాజా నోటికి తాళం

కాంగ్రెస్ పార్టీ విభజన ప్రకటనకు ముందు.. ఆ తర్వాత దాదాపు ప్రతి రోజు మీడియా ముందుకొచ్చి..రాష్ట్రవ్యవహారాలపై స్పందించిన  దిగ్విజయ్‌..ఇప్పుడు ఏపీ మీడియాకు దూరంగా ఉంటున్నారు.  రాష్ట్ర వ్యవహారాలపై స్పందించడం  మానేశారు. విభజన ప్రకటనపై వెనక్కు తగ్గేది లేదని పదే పదే ప్రకటించి.. సీమాంధ్రలో అగ్గిని రాజేసిన దిగ్విజయ్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు..?  ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలకు  సైతం అంతుబట్టడం లేదు..
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా దిగ్విజయ్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ సీన్ పూర్తిగా మార్చేశారు. అలా వచ్చి రాగానే విభజన, సమైక్యంపై  రాష్ట్రంలో ముఖ్యనేతల నుంచి నివేదికలు కోరడంతోనే రాజకీయ వేడి రగిలింది. దానిని క్రమంగా పెంచుకుంటూ పోయారు. అటు అధిష్టానం కూడా తెలంగాణపై తేల్చేసింది. విభజనకు అనుకూలమని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని తెలిపింది.. ఈ ప్రకటన తర్వాత సీమాంధ్రలో సమైక్య ఉద్యమం  ప్రారంభమైంది.రోజురోజుకి ఉద్యమం ఉధృతమవుతుంటే..దానికి ఆజ్యంపోసేలా దిగ్విజయ్.. తెలంగాణపై వెనక్కు వెళ్లేది లేదని పదే పదే ప్రకటనలు చేశారు . దీనిపైనే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ అధిష్టానానికి  ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఒక వైపు సమైక్య నిరసనలు మిన్నంటుతుంటే ఢిల్లీ నుంచి వచ్చే ప్రకటనలతో  సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా మారారు. ముఖ్యంగా కేంద్రమంత్రులు, ఎంపీలపై  ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది.సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు.. కాంగ్రెస్ హైకమాండ్‌కు దిగ్విజయ్‌  దూకుడుకు కళ్లెం వేయాలని వేడుకోవటంతో ప్రస్తుతం ఆయన  మౌనం పాటిస్తున్నారని ఢిల్లీ వర్గాలంటున్నాయి. విభజన ప్రకటన తర్వాత రాష్ట్రానికి వస్తానని.. ఇరు ప్రాంత నేతలతో చర్చించి.. సమస్య పరిష్కారం చేస్తానని చెప్పిన దిగ్విజయ్ ఇప్పుడు పత్తా లేరు. మన రాష్ట్రానికి రావడం పక్కన పెడితే.. కనీస ఏపీ వ్యవహారాలపై స్పందించడం కూడా మానేశారు. ఇక సీమాంధ్రలో సమైక్య ఉద్యమం  ఉధృతంగా సాగడంతో విభజన ప్రక్రియపై కాంగ్రెస్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. క్రమంగా కేబినెట్‌ నోట్‌ను  కూడా వివిధ కారణాల సాకుతో వాయిదా వేసుకుంటూ వస్తుంది. ఈ సమయంలో మీడియా విభజనపై ఎందుకు ముందడుగు వేయటం లేదని ప్రశ్నిస్తే.. ఏమని సమాధానం చెప్పాలి..? అనేది కూడా దిగ్విజయ్‌ సింగ్‌కు అంతుబట్టడం లేదు.. మొత్తానికి డిగ్గీరాజా.. నోటికి తాళం వేసుకున్నారు. అప్పడప్పుడు మోడీ మీద విమర్శల బాణాలు విసురుతున్న ఏపీ వ్యవహారాల మీద మాత్రం నోరు  మెదపడం లేదు.