13, అక్టోబర్ 2016, గురువారం

10 వేల కోట్ల వ్యవహారంపై మోడీకి జగన్ లేఖ

హైదరాబాద్‌ నుంచి రూ.10వేల కోట్ల నల్లధనం ప్రకటించిన వ్యక్తి వైసీపీ అధ్యక్షుడు జగనే అని తెలుగు దేశం పార్టీ పదే పదే ఆరోపణలు చేస్తోన్న నేపధ్యంలో ఈ వ్యవహారం పై విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని గురువారం జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసారు. ఏపీ, తెలంగాణల నుంచి వెల్లడి అయిన నల్ల ధనం మొత్తం విలువ 13 వేల కోట్లు అని లెక్క తేలితే అందులో హైదరాబాద్ నుంచి 10 వేల కోట్లు ఒక్కరే ప్రకటించారని ఆ ఒక్కరు జగనే అని ఈ ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారం పై స్పందించిన జగన్ ఈ లేఖ రాసారు.ఈ లేఖలోనే జగన్ మరి కొన్ని అంశాలను ప్రస్తావించారు. స్వచ్చంద ఆదాయ వెల్లడి పధకం ప్రకారం ఏ వ్యక్తి ఎంత ప్రకటించారు ? ఏ ప్రాంతం నుంచి ప్రకటించారు తదితర వివరాలు బయటకు వెల్లడించరు. మోడీ ప్రభుత్వమే ఈ విషయాన్నీ స్పష్టం గా చెప్పింది. ఈ క్రమంలో మరి ఆ వివరాలు చంద్రబాబుకు ఎలా తెలిసాయి? అని జగన్ పేర్కొన్నారు.  to read more click on the matter.

12, అక్టోబర్ 2016, బుధవారం

ఈనాటి బంధం ఏనాటిదో ?

ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలితను దగ్గరుండి కనిపెట్టుకుని చూస్తున్న బృందం లో శశికళా నటరాజన్ ఒకరు . తమిళనాడు రాష్ట్ర పాలనా వ్యవహారాలను షీలా బాలకృష్ణన్ చూస్తుంటే ... శశి రాజకీయ వ్యవహారాలను నడిపిస్తున్నారు. శశి జయ ప్రాణసఖి. వీరిద్దరిది విడదీయ లేని బంధం. జయ, శశిల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈనాటిది కాదు. 1991లో అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చిన తరువాత అది వెలుగు చూసింది. అంతకుముందు నుంచే వీరిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నా అది పోయస్ గార్డెన్‌కే పరిమితం. అధికారంలోకి వచ్చాక ఇద్దరూ కలిసి కనిపించడంతో వీరి స్నేహం బహిర్గతమయ్యింది. గతంలో శశికళ వీడియో క్యాసెట్ల దుకాణం నడిపేది. అన్నాడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ఆ పార్టీకి ప్రచార కార్యదర్శిగా పని చేసే వారు.శశికళ ఆ ప్రచారానికి సంబంధించిన వీడియో క్యాసెట్లు తీసుకుని వచ్చి జయలలితకు అందజేసేవారు. అలా వీరిద్దరి మధ్య స్నేహం కుదరడంతో శశికళ, జయలలిత దగ్గరే ఉండిపోయారు. 1991లో పార్టీ అధికారంలోకి రావడంతో శశికళకు పార్టీలో పట్టు దొరికింది. జయలలితకు ఆమె మరీ అంతగా ఎలా దగ్గరయ్యారో ఈనాటికీ అంతుబట్టని విషయం. జయలలిత స్వతహాగా తెలివైనవారు.  to  see  more
click on the matter