1, అక్టోబర్ 2016, శనివారం

ఎవరీ బీహార్ బాహుబలి ??

బీహార్ బాహుబలి, ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ కు పాట్నా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడం తో మళ్ళీ జైలుకు వెళుతున్నాడు. రాజీవ్ రోషన్, అతడి ఇద్దరు సోదరుల హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన షాబుద్దీన్ 11 ఏళ్ల తర్వాత హైకోర్టు బెయిల్‌తో బయటకు వచ్చారు. వచ్చినోడు ఊరుకున్నాడా తింగరి కామెంట్లు చేసాడు. ఆయన అనుచరులు రెచ్చి పోయారు. దీంతో షాబుద్దీన్ మళ్ళీ కృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పని పరిస్థితులు వచ్చాయి. ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్,నితీశ్ కుమార్ ప్రభుత్వం కూడా బెయిల్ రద్దును కోరుతూ సుప్రీంకోర్టు కు వెళ్లారు . బాధిత కుటుంబాలు కూడా ఆయన బయటకు రావడం వల్ల తమకు ప్రాణాపాయం ఉందని మొర పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్ బెయిల్ రద్దు చేసింది. ఎవరీ షాబుద్దీన్ ? బీహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. ఈయన కథ కూడా సినిమా స్టోరీ లా ఉంటుంది . 30 కి పైగా కేసులున్న భయానక నేరచరిత్ర, నాలుగు సార్లు ఎంపీగా చేసిన రాజకీయ చరిత్ర. ఇవన్నీ కలిపితే షాబుద్దీన్. బిహార్ లో ఆయన పేరు వింటే ప్రత్యర్థులు, అధికార యంత్రాగం హడలిపోతారు. రెండు దశాబ్దాల పాటు నేరాలను, రాజకీయాలను సమాంతరంగా నడిపాడు. సొంత బలగాలను ఏర్పాటు చేసుకుని ఓ దశలో సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపాడు. లాలూకు సన్నిహితంగా ఉండే షాబుద్దీన్. జైలునుంచి రాగానే లాలూ కే తాను విధేయుడిగా ఉంటాను తప్ప నితీష్ కి కాదని చెప్పాడు. - See more at: http://www.kaburluguru.com/banner/single/279#sthash.qlhUnXZw.dpuf

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి